పురుషులలో జుట్టు రాలటం ఆపే ఇంటి చిట్కాలు
పురుషులలో జుట్టు రాలటం అనేది, జన్యుపర లోపాల వలన చాలా సాధారణం అని చెప్పవచ్చు. అంతేకాకుండా, చాలా వరకు తినే ఆహరంలో పోషకాల కొరత వలన, ఒత్తిడి మరియు ఉద్రేకత వంటి సమస్యలకు అధికంగా గురయ్యే వారు జుట్టు రాలటానికి ఎక్కువగా గురి అవుతున్నారు.
a) తాజాగా కత్తిరించిన ఉల్లిపాయ ముక్కను తీసుకొని, బట్టతలపై, చర్మం ఎర్రగా మారే వరకు రుద్దండి. ఆ తరువాత ఉల్లిపాయతో మసాజ్ చేసిన ప్రాంతంలో తేనెను పూయండి.
b) ఒక చిన్న పాత్రలో గుడ్డు పచ్చసొన మరియు తేనెలను కలిపి, జుట్టు మరియు తలపై చర్మానికి అప్లై చేయండి. కొద్ది సమయం లేదా కనీసం 30 నిమిషాల వరకు ఎండే వరకు వేచి ఉండండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగి వేయండి.
c)రెండు చెంచాల పచ్చి గ్రామ్ పౌడర్, ఒక చెంచా నిమ్మరసం కలిపి ఇంట్లోనే షాంపూను తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, కనీసం ఒక గంట సేపు అలానే వదిలేయండి. తరువాత నీటితో కడిగి వేయండి
d) మెంతి విత్తనాలను రుబ్బి, ఈ పొడికి నీటిని కలిపి ఒక పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి 40 నిమిషాల పాటూ అలానే ఉంచి తరువాత నీటితో కడిగి వేయండి. ఈ మిశ్రమాన్ని కూడా చల్లటి నీటితో కడిగి వేసిన తరువాత, చేతి వేళ్ళతో తలపై మసాజ్ చేయండి. ఇలా ఒక నెల పాటూ ఈ చికిత్సను అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
e) ఒక కప్పు ఆవాల నూనె మరియు 4 చెంచాల హెన్న ఆకులను కలిపి వేడి చేయండి. ఈ మిశ్రమాన్నివడపోసి, శుభ్రమైన బాటిల్ లో దాచి పెట్టండి. ప్రతి రోజు బట్టతలపై ఈ నూనె మసాజ్ చేయటం వలన కొన్ని వారాలలోనే మంచి ఫలితాలను పొందుతారు.
Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke
The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…