Home Health & Beauty వత్తైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు
Health & Beauty - March 19, 2016

వత్తైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

ఒక చెంచా ఎండిన టమాటను తీసుకొని వీటిని రెండు చెంచాల కొబ్బరి నూనెలో వేసి వేడి చేయండి. ఈ మిశ్రమం చల్లబరచిన తరువాత, పడుకోటానికి ముందుగా తలపై మసాజ్ చేయండి. తరువాత ఉదయాన ఎప్పటి లాగానే, షాంపూతో కడిగివేయండి.

రెండు చెంచాల మెంతి విత్తనాలను తీసుకొని 7 నుండి 8 గంటల పాటూ నీటిలో నానబెట్టండి, తరువాత పేస్ట్’లా దంచండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు తలపై చర్మానికి పూసి కనీసం 30 నిమిషాల వరకైన వేచి ఉండండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి. ఇలా చేయటం వలన జుట్టుకు కావాల్సిన పోషకాలు అందించబడి, జుట్టు వత్తుగా మారుతుంది.

నారింజ పండు తొక్కలను తీసుకొని మెత్తగా దంచి, గుజ్జులా తయారు చేయండి. ఇలా తయారు చేసిన గుజ్జును వారానికి ఒకసారి తలపై ప్యాక్’లాగా వాడటం వలన జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

ఒకటి లేదా రెండు కలబంద ఆకుల నుండి గుజ్జును సేకరించండి. ఈ రసాన్ని జుట్టు మరియు తలపై చర్మానికి పూయండి, గోరు వెచ్చని నీటితో కడిగే ముందు అరగంట పాటు అలానే వదిలేయండి.

మీ జుట్టు ఉన్న పొడవును బట్టి, ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకోండి. జుట్టును తడిపి, గుడ్డు సొనను పూయండి. 5 నుండి 10 నిమిషాల వరకు వేచి ఉండండి. గాడతలు తక్కువగా ఉన్న షాంపూతో గోరువెచ్చని నీటితో కడిగి వేయండి. ఇలా వారంలో 3 నుండి 4 సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొండుతారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…