Home News మీ తోనే తప్పు చేయిస్తారు, మీ అకౌంట్ లోని డబ్బును దోచేస్తారు
News - December 10, 2016

మీ తోనే తప్పు చేయిస్తారు, మీ అకౌంట్ లోని డబ్బును దోచేస్తారు

కుటీర పరిశ్రమగా చేసుకొని ఓగ్రామం దేశంలో ఆర్యంత విలాసవంతమైన జీవతాన్ని గడుపుతోంది. ఇక్కడ సైబర్ క్రిమినల్స్ వందల్లో పుట్టుకొస్తుండటం దెస భద్రతకే పెను ప్రదంగ మారింది. ఇక్క డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించి ఏ మోసాలు జరిగినా దాని మూలాలు జార్ఖండ్ రాష్ట్రం లోని జమ్తార జిల్లా కేంద్రం వైపు చూపిస్తున్నాయి.

హలో… మై ఎస్.బి.ఐ హెడ్ ఆఫీస్ సె  బాత్ కార్ రహ హుం, ఆప్కా క్రెడిట్ కార్డు అప్ డేట్  కర్న  హాయ్, థోడా సమాచార డిజియే… అంటూ వివరాలు తీసుకొని సొమ్ము కాజేస్తున్నారు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన స్పెషల్ ఆపరేషన్ లో  ఈ గ్రామా బండారం వెలుగులోకి వచ్చింది. ఝార్ఖండ్ రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్ కు వెళ్లే ప్రధాన రహదారిలో జమ్ తార జిల్లా వస్తోంది. జమ్ తార జిల్లా హెడ్ క్వార్టర్, ఇక్కడ 90 వేల మందికి పైగా జనాభా నివాసముంటారు. దీనికి చుట్టూ పక్కల ఉండే గ్రామాలూ ఎక్కువగా వ్యవసాయం మీదనే ఆధార పడీ జీవనం సాధిస్తుంటారు. 2012  కు ముందు ఇక్కడ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు చాహల్ తక్కువగా ఉండేవారు. వివిధ పట్టణాలకు జీవనోసాది కోసం వెళ్లిన యువకులు ఆయా ప్రాంతాలలోని కాల్ సెంటర్లలో పనిచేయటం, పని చేసిన వారితో పరిచయాలు పెంచుకోవడం  చేసారు. ఆరు నెలల పాటు అక్కడి కాల్ సెంటర్ నుంచి బ్యాంకు వినియోగ దారులతో మాట్లాడే అనుభవం తో తిరిగి తమ స్వస్థలాలకు కొందరు వచ్చారు.

తరువాత ఒక సెల్ ఫోన్, దానికి తగ్గట్టు సిం కార్డులు, ఒక కంప్యూటర్, దానికి ఇంటర్నెట్ తో ఒక కుటీర పరిశ్రమల  వలె ఇళ్లలోనే అద్దాలను ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్ చేసి ఎలా మాట్లాడాలి అనే విషయం ఫై ముందుగానే ఒకరికొకరు చెప్పుకుంటారు, ఇలా 2013  లో ఇక్కడ సైబర్ నేరగాళ్లకు గట్టిగ పునాది పడింది. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజలకు ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును అప్డేట్ చేయాలి, ఆధార్ లింక్ ఇవ్వాలి అంటూ మోసాలకు పాల్పడ్డారు.

ఖాతా నుంచి ఆన్లైన్లో బదిలీ…

సైబర్ నేరస్తుల చేతిలో మోసపోతున్న క్రెడిట్, డెబిట్ కార్డు దారులు ఎక్కువ మండే ఉంటున్నారు. వీరికి వచ్చే ఫోన్స్ లో 90  శాతం జమ్ తార నుండి వస్తున్నవేనని చెప్పారు. సాధారణంగా  క్రెడిట్, డెబిట్ కార్డులపై ఉండే సీరియల్ నంబర్లను ఆధారంగా చేసుకొని ముందుగా మొదటి నాలుగు నంబర్లు వల్లే చెబుతారు, అది నిజమని మిగతా నంబర్లు వినియోగదారులు చెబతారు. మీ కార్డును అప్డేట్ చేస్తున్నాం మీ సెల్ల్ఫోన్ కు ఓటీపీ / otp (వన్ టైం పాస్వర్డ్ ) వస్తుందండు సూచిస్తూ, దానిని వెంటనే మాకు చెప్పండి అని అడుగుతారు. వారు బ్యాంకు వారే కదా అని, మన సెల్ఫోన్ కు వచ్చిన ఓటీపీ / otp నెంబర్ వారికీ చెపుతాం. చెప్పిన వెంటనే వారు మీ అకౌంట్ నుండి కొంత డబ్బును ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది.

ఈసారి ఇలాంటి కాల్ మీకు వస్తే జాగ్రత్తగా వ్యవహరించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *